టీమిండియాలో విరాట్ కోహ్లీ ఎంట్రీకి తానే కారణమని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో ఎమర్జింగ్ కప్‌లో ఆడుతున్న కోహ్లీని చూసి అతడిలో అద్భుత ప్రతిభ ఉందని గ్రహించానని అన్నాడు.
'విరాట్ నా వల్లే జట్టులోకి వచ్చాడు' - cricket
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరొందాడు కోహ్లీ. అలాంటి ఆటగాడు జట్టులోకి రావడానికి కారణం తానే అంటున్నాడు వెంగ్ సర్కార్.
"విరాట్‌ను జట్టులోకి తీసుకుందామని నాటి కెప్టెన్ ధోని, కోచ్ కిర్‌స్టన్‌కు చెబితే.. మరిన్ని టోర్నీలు ఆడిన తర్వాత ఎంపిక చేద్దామని అన్నారు. కోహ్లీని తీసుకోవాల్సిందేనని నేను పట్టుబట్టగా సరేనన్నారు. ఆ విధంగా అప్పట్లో బద్రీనాథ్ స్థానంలో విరాట్ జట్టులోకి వచ్చాడు.’
వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్
2008 ఆగస్టు 18న శ్రీలంక జట్టుపై అరంగేట్రం చేశాడు విరాట్. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా కొనసాగుతున్నాడు. త్వరలో జరగబోయే ప్రపంచకప్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.