టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అంటే తనకు అసూయ అంటూ వస్తున్న వ్యాఖ్యలపై స్పందించాడు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. తమ మధ్య అలాంటిదేమి లేదని, మంచి సంబంధాలు ఉన్నాయని అశ్విన్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో పంచుకున్నాడు.
'అశ్విన్‌పై నాకు ఈర్ష్యా.. అలా ఎవరన్నారు?' - బౌలర్ అశ్విన్ తాజా వార్తలు
అశ్విన్‌తో తనకు విభేదాలు లేవని చెప్పిన హర్భజన్ సింగ్.. అతడు ప్రపంచ నంబర్.1 స్పిన్నర్ అని కొనియాడాడు.
"మన ఇద్దరి మధ్య ఈర్ష్య, అసూయ ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. వాళ్లేమన్న అనుకోని నాకు సంబంధం లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అద్భుతమైన స్పిన్నర్లలో నువ్వు ఒకడివి. ఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్.. వారి దేశంలో పిచ్‌లు అనుకూలించకున్నా, బాగా రాణిస్తున్నాడు" -హర్భజన్ సింగ్, సీనియర్ క్రికెటర్
భారత్ తరఫున 2016లో చివరగా ఆడిన హర్భజన్.. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20ల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు టీమిండియాకు 71 టెస్టులాడిన అశ్విన్.. 365 వికెట్లు పడగొట్టాడు. లైయన్.. 96 మ్యాచ్‌ల్లో 390 వికెట్లు సాధించాడు.