ఇటీవలే కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తనను తాను ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తనకు ప్రేమను పంచుతూ, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
నాకు ఇప్పుడు బాగానే ఉంది: దీపక్ - దీపక్ చాహర్
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్ ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.
ఐపీఎల్ నిమిత్తం సీఎస్కే జట్టుతో దుబాయ్ చేరుకున్న తర్వాత చేసిన పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు, 13 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారిలో దీపక్ చాహర్ ఒకరు. లక్షణాలు లేని కేసులైనప్పటికీ.. వారిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు అధికారులు. ఈ క్రమంలోనే సీఎస్కే క్వారంటైన్ సమయాన్ని పొడిగించారు.
కాగా తాజాగా చేసిన పరీక్షల్లో మిగిలిన జట్టు సభ్యులకు నెగిటివ్ నిర్ధరణ అయ్యింది. సెప్టెంబరు 3న ఆఖరి పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీసు సెషన్ ప్రారంభించనున్నారు.