తెలంగాణ

telangana

ETV Bharat / sports

పూర్తి ఫిట్​నెస్​ సాధించిన లుంగి ఎంగిడి - దక్షిణాఫ్రికా

న్యూజిలాండ్​తో మ్యాచ్​కు ముందు సఫారీ బౌలర్​ ఎంగిడి పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. సెమీస్​ చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్​ల్లో దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చాడీ ఫాస్ట్​ బౌలర్.

పూర్తి ఫిట్​నెస్​ సాధించిన లుంగి ఎంగిడి

By

Published : Jun 19, 2019, 6:00 AM IST

Updated : Jun 19, 2019, 8:25 AM IST

కివీస్​తో పోరుకు ముందు దక్షిణాఫ్రికాకు సంతోషాన్నిచ్చే అంశం ఆ జట్టు పేసర్ ఎంగిడి పూర్తి ఫిట్​నెస్ సాధించడం. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఎంగిడి.

"జట్టు సిబ్బంది సహకారంతో పూర్తి ఫిట్​నెస్ సాధించా. న్యూజిలాండ్​తో జరిగే ఈ మ్యాచ్​కు సిద్ధంగా ఉన్నా." -లుంగి ఎంగిడి, దక్షిణాఫ్రికా బౌలర్

ఈ ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా తరఫున తొలి రెండు మ్యాచ్​లే ఆడాడు ఈ బౌలర్. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. తర్వాత రెండు మ్యాచ్​లకు విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు కివీస్​తో పోరుకు సిద్ధమయ్యాడు. సఫారీ జట్టులో ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు సీనియర్ బౌలర్ స్టెయిన్.

నెట్స్​లో ప్రాక్టీసు చేస్తున్న లుంగి ఎంగిడి

ప్రస్తుత ప్రపంచకప్​లో ఐదు మ్యాచ్​లాడిన దక్షిణాఫ్రికా.. గత మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై మాత్రమే గెలిచింది. సెమీస్​ చేరుకోవాలంటే మిగతా వాటిలో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

బర్మింగ్​హామ్ వేదికగా న్యూజిలాండ్​తో నేడు తలపడనుంది దక్షిణాఫ్రికా. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ఆరంభం కానుంది.

Last Updated : Jun 19, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details