తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టీ20 హైదరాబాద్​లో.. చివరిది ముంబయిలో - venue shift

వెస్టిండీస్​తో జరగనున్న తొలి టీ20కి వేదికను ముంబయి నుంచి హైదరాబాద్​కు మార్చింది బీసీసీఐ. డిసెంబరు 11న జరగనున్న చివరి మ్యాచ్​కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది.

Hyderabad to host 1st T20I against WI, 3rd match in Mumbai: BCCI
వెస్టిడీస్ - భారత్

By

Published : Nov 27, 2019, 8:35 PM IST

డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సమరాన్ని షురూ చేయనుంది టీమిండియా. అయితే ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్ వేదికను మార్చింది బీసీసీఐ. తొలి టీ20ని ముంబయి నుంచి హైదరాబాద్​కు తరలించారు.భద్రతా కారణాల దృష్ట్యా వేదికను హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియానికి మార్చినట్లు అధికారులు తెలిపారు.

తొలుత వాంఖడే వేదికగా ఈ మ్యాచ్​ నిర్వహించాలనుకున్నారు. అంబేడ్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్ దివస్) సందర్భంగా భద్రత కల్పించలేమని వేదికను మార్చాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘాన్ని(ఎమ్​సీఏ) ముంబయి పోలీసులు అడిగారు. ఈ కారణంగా మ్యాచ్​ హైదరాబాద్​కు తరలింది.

డిసెంబరు 11న జరగనున్న చివరి టీ20కి ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్​ హైదరాబాద్​లో నిర్వహించనుండగా.. రెండో టీ20 కేరళ తిరువనంతపురంలో జరగనుంది.

బంగ్లాదేశ్​తో జరిగిన పొట్టి సిరీస్​కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ.. మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. భువనేశ్వర్​ కుమార్ కూడా గాయం నుంచి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు.

విండీస్​తో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్​లు ఆడనుంది టీమిండియా. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకోని కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని యువ క్రికెటర్ సంజు శాంసన్ భర్తీ చేయనున్నాడు.

ఇదీ చదవండి: 2023 పురుషుల హాకీ ప్రపంచకప్​కు ఒడిశా ఆతిథ్యం

ABOUT THE AUTHOR

...view details