తెలంగాణ

telangana

ETV Bharat / sports

హస్సీ 'ప్రత్యర్థి ఎలెవన్'లో ధోనీకి దక్కని చోటు - హస్సీ 'ప్రత్యర్థి ఎలెవన్'లో ధోనీకి దక్కని చోటు

తన 'బెస్ట్ ఆఫ్ ఎనిమీస్ ఎలెవన్​'లో భారత్ నుంచి కోహ్లీ, సచిన్, సెహ్వాగ్​లకు స్థానం కల్పించిన ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీ.. ధోనీని మాత్రం ఎంపిక చేయలేదు.

Hussey picks Tendulkar, Kohli and Sehwag in 'Best of Enemies' XI
హస్సీ 'ప్రత్యర్థి ఎలెవన్'లో ధోనీకి దక్కని చోటు

By

Published : Apr 29, 2020, 4:19 PM IST

Updated : Apr 29, 2020, 4:29 PM IST

టెస్టు క్రికెట్​లో తనకు 'ఉత్తమ ప్రత్యర్థి ఎలెవన్' జట్టు ఇదేనంటూ ఓ జాబితాను ప్రకటించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ మైక్​ హస్సీ. భారత్​ నుంచి దిగ్గజ క్రికెటర్ సచిన్, సెహ్వాగ్​, కోహ్లీలు ఇందులో ఉన్నా, ధోనీకి స్థానం లభించలేదు. అయితే మహీకి చోటివ్వకపోవడంకు గల కారణాన్ని వెల్లడించాడు హస్సీ.

ఓపెనర్లుగా సెహ్వాగ్, గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)లను ఎంచుకున్న హస్సీ.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బ్రియాన్ లారా, సచిన్, కోహ్లీ, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కరలకు చోటిచ్చాడు. లోయరార్డర్​లో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, జేమ్స్ అండర్సన్, ముత్తయ్య మురళీధరన్​లను ఎంచుకున్నాడు.

సుదీర్ఘ ఫార్మాట్​లో ధోనీ కంటే సంగక్కర ప్రదర్శన బాగుండటం వల్లే మహీకి జట్టులో స్థానం కల్పించలేదని హస్సీ చెప్పాడు.

2005 నుంచి 2013 వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఆడిన మైక్​ హుస్సీ.. ప్రస్తుతం ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​కు బ్యాటింగ్ కోచ్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇదీ చూడండి : 'సెహ్వాగ్ కన్నా అతడు మంచి ప్లేయర్ కానీ బుర్రలేదు'

Last Updated : Apr 29, 2020, 4:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details