పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌ను రావల్పిండి క్రికెట్ అధికారులు గౌరవించారు. పాక్ క్రికెట్‌కు అందించిన సేవలకుగాను కేఆర్ఎల్ స్టేడియంకు అక్తర్ పేరు పెట్టారు. దీనిని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అక్తర్ చెప్పాడు. ఈ విషయమై మాటలు రావట్లేదని ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
షోయబ్ అక్తర్‌కు గౌరవం.. ఆ స్టేడియానికి పేరు - క్రికెట్ న్యూస్
ఫాస్ట్ బౌలర్‌గా పాక్ తరఫున ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అక్తర్ పేరును రావల్పిండి స్టేడియానికి పెట్టారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు.
షోయబ్ అక్తర్‌కు గౌరవం.. ఆ స్టేడియానికి పేరు
అక్తర్‌ను 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇతడు.. 14 ఏళ్ల తర్వాత 2011లో రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో 224 మ్యాచ్‌లాడి 444 వికెట్లు తీశాడు.
ఇది చదవండి:సెహ్వాగ్ అలా అంటే కొట్టేవాడిని: అక్తర్