భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తన వయసుకు సంబంధించి.. భార్య ప్రతిమతో పాటు, మహేంద్ర సింగ్ ధోనీ ఎలా ఆటపట్టిస్తాడో చెప్పాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నాడు.
"నిజానికి మానసికంగా 32ఏళ్ల కంటే ఎక్కువగా పెరిగా. నా భార్య ఎప్పుడూ నన్ను ఓల్డ్ అంటూ పిలుస్తుంది. ఇక మాహీ భాయ్ అయితే, ఎలా ఉన్నావ్ పెద్దాయన? అని అడుగుతాడు. నీ వయసు 32 ఏళ్లు మాత్రమే.. కానీ 52 ఏళ్లలా ఎదిగావు.. అంటూ ఆటపట్టిస్తాడు."