టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో తనను పోల్చుకోవడం యువ క్రికెటర్ రిషభ్ పంత్ మానుకోవాలని మాజీ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ సూచించారు. తనకున్న అద్భుతమైన ప్రతిభతో రాణించగల సత్తా పంత్‌లో ఉందని అన్నారు.
"రిషబ్ పంత్‌ను ప్రతిసారీ ధోనీతో పోల్చుతున్నారు. బహుశా అతడూ అదే ఆనందంలో ఉన్నాడు. ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని మేం చాలాసార్లు సూచించాం. మహీది పూర్తిగా భిన్న వ్యక్తిత్వం.. అతడితో పోలిస్తే పంత్ కూడా అసాధారణమైన ఆటగాడే. ఇతడిలోనూ ప్రతిభ ఉంది. అందుకే పంత్‌కు మద్దతు ఇస్తున్నాం. అయినా ఇప్పటికీ ధోనీతో పోల్చుకోవడం సరైనది కాదు. అదృష్టవశాత్తూ మహీ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఇప్పుడైనా పంత్ అతడితో పోల్చుకోవడం మానేసి ఆటపై నిలకడ అందుకుంటాడని భావిస్తున్నాను"