టీమిండియాతో ఇటీవలే జరిగిన టీ20లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంషీ.. విన్నూత్న రీతిలో సెలబ్రేషన్స్ జరుపుకొన్నాడు. శిఖర్ ధావన్ వికెట్ తీసిన తర్వాత తన షూ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అప్పట్లో అది చర్చనీయాశమైంది. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. మాన్షీ టీ20 లీగ్‌లో పార్ల్ రాక్స్ జట్టుకు ఆడుతున్న షంషీ.. డర్బన్ హీట్‌తోబుధవారం జరిగిన మ్యాచ్‌లో సెలబ్రేషన్స్‌కు మ్యాజిక్ జోడించాడు.
ఇదీ జరిగింది...
షంషీబౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు విహాబ్ లూబే. ఆ సమయంలో ముందుగా చేతుల్లోకి ఒక ఎరుపు రంగు గుడ్డ తీసుకున్నషంషీ.. దానిని స్టిక్‌గా మార్చాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడంషంషీకి కొత్తేమీ కాదు. ఇదే లీగ్‌లో గత నెలలో జోజి స్టార్స్‌తో జరిగిన పోరులోనూషంషీఇదే తరహా మ్యాజిక్‌తో అభిమానుల్ని అలరించాడు. ప్రస్తుత వీడియో వైరల్‌గా మారింది. అలా ఓ క్రికెటర్.. స్టిక్‌లు ఎలా తెస్తాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.