తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గులాబి' బంతి లెక్క తేలాల్సిందే! - ind vs ban

తొలిసారి డే/నైట్ మ్యాచ్​కు అతిథ్యమివ్వబోతున్న భారత్... గులాబి బంతితో పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం డే/నైట్​ టెస్టుల ఫలితాలపై ఓ లుక్కేద్దాం.

పింక్

By

Published : Nov 19, 2019, 6:30 AM IST

'గులాబి' బంతి లెక్క తేలాల్సిందే!

టీమిండియా తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడేందుకు సన్నద్ధమవుతోంది. సంప్రదాయ ఎరుపు బంతికి భిన్నంగా పింక్​ బాల్​తో పోరుకు సన్నాహకాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, జింబాబ్వే ఈ గులాబి బంతి మజాను ఆస్వాదించగా.. తొలిసారి భారత్-బంగ్లాదేశ్​ ఈ మ్యాచ్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు 11 డే/నైట్ మ్యాచ్​లు జరగ్గా ఒక్కటీ.. డ్రా కాకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్​ల్లోనూ గెలిచి.. డై/నైట్​ టెస్టుల్లో అత్యంత విజయవంతమైన జట్టు​గా కొనసాగుతోంది.

గులాబి టెస్టుల ఫలితాలు

శ్రీలంక.. మూడు మ్యాచ్​లు ఆడి రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్​లూ ఉపఖండం బయట జరగడం విశేషం. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చెరో మ్యాచ్​ గెలిచి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్​ మాత్రం ఆడిన మూడు మ్యాచ్​లనూ ఓడి, చివరి స్థానంలో నిలిచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం (22వతేదీ) ఈ చారిత్రక టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​ ముస్తాబవుతోంది. మొదటి మూడు రోజులు.. రోజుకు దాదాపు 65 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

ఇవీ చూడండి.. 'సవ్యసాచి' బౌలింగ్​కు నెటిజన్ల ఫిదా!

ABOUT THE AUTHOR

...view details