తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అదృష్టం కలిసొస్తే ఈ సారి టైటిల్ పంజాబ్​దే' - డేవిడ్ మలన్

2021 తమ జట్టుకు అదృష్ట ఏడాదిగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు పంజాబ్ కింగ్స్ క్రికెటర్ డేవిడ్ మలన్. అన్నీ కలిసొస్తే ఈ సారి ట్రోఫీని పంజాబ్​ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

Hopefully 2021 is the year that luck changes and Punjab lifts IPL trophy, says Malan
'అదృష్టం కలిసొస్తే ఈ సారి టైటిల్ పంజాబ్​దే'

By

Published : Apr 1, 2021, 5:31 AM IST

2021 ఏడాదిని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు పంజాబ్​ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలన్. కొన్ని మ్యాచ్​ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తే ఈ సారి పంజాబ్​ ట్రోఫీని గెలిచే అవకాశముందని పేర్కొన్నాడు.

గత నెలలో ఐపీఎల్​ వేలానికి ముందు ఫ్రాంఛైజీ పేరుతో పాటు లోగోను మార్చింది పంజాబ్​. టీ20 నంబర్ వన్ బ్యాట్స్​మెన్​ డేవిడ్​ మలన్​ను రూ.1.5 కోట్లకే దక్కించుకుంది. తాజా సీజన్​లో తమ జట్టును ఫైనల్​ చేర్చడానికి ప్రయత్నిస్తానని అతడు తెలిపాడు. ట్రోఫీ గెలవడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించాడు.

"క్రికెట్​ అభిమానులందరికీ ఓ సందేశం. మీ మద్దతుతో ఈ సీజన్​ మాకు ఆశాజనకంగా మారొచ్చు. మేము కొన్ని మ్యాచ్​ విన్నింగ్ ప్రదర్శనలు ఇవ్వొచ్చు. ప్లే ఆఫ్స్​ను దాటవచ్చు. చివరికి టైటిల్​ను గెలవవచ్చు" అని ట్విట్టర్​లో పోస్టు చేసిన వీడియోలో మలన్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:ఈ ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​​ కొత్త జెర్సీ ఇదే

ABOUT THE AUTHOR

...view details