తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆడింది ఒక్క మ్యాచే.. ఆందోళన వద్దు' - world cup 2019

ప్రాక్టీసు మ్యాచ్​లో ఓటమి అనంతరం స్పందించాడు టీమిండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా. ఒక్క ఇన్నింగ్స్​తోనే భారత ఆటగాళ్లపై ఓ అంచనాకు రావొద్దని, కుదురుకునేందుకు కొంత సమయం పడుతుందన్నాడు.

'ఆడింది ఒక్క మ్యాచే.. ఆందోళన వద్దు'

By

Published : May 26, 2019, 5:07 PM IST

ప్రపంచకప్​ ముందు జరిగిన ప్రాక్టీసు మ్యాచ్​లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. న్యూజిలాండ్​ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఫేవరెట్లలో ఒకటైన భారత జట్టు ఇలా ఆడడం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్వింగ్​ బౌలింగ్​ను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకుంది కోహ్లీసేన. జడేజా ఒక్కడే 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం ఈ మ్యాచ్​ ఓటమిపై స్పందించాడు రవీంద్ర జడేజా.

అర్ధసెంచరీతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా

"ఇది మా తొలి మ్యాచ్. ఒక్క చెత్త ఇన్నింగ్స్‌తో ఆటగాళ్లపై అంచనాకు రావొద్దు. బ్యాటింగ్‌ విభాగం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో ఫ్లాట్‌ వికెట్లపై ఆడాలంటే కొంత కుదురుకోవాలి. కొంత సమయం పడుతుంది. మేమంతా దానిపైనే కసరత్తు చేస్తున్నాం. బాధపడాల్సిన అవసరమే లేదు. మేం మంచి క్రికెట్‌ ఆడతాం. అంతా అనుభవం ఉన్న ఆటగాళ్లే" -రవీంద్ర జడేజా, టీమిండియా క్రికెటర్

మ్యాచ్​లో ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా సాధారణ రీతిలో ఆడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటానని చెప్పాడీ భారత క్రికెట్ ఆల్​రౌండర్.

"ముందే బ్యాటింగ్‌కు వస్తే నేను ఔటైపోయేవాడిని. పిచ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుందని మాకు ముందే తెలుసు. కానీ మేం కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం. ఏ స్థానంలోనైనా నేను బ్యాటింగ్‌ చేయగలను" -రవీంద్ర జడేజా, టీమిండియా క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details