తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియా గులాబి బంతితో ఆడుతుందని ఆశిస్తున్నా'​

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య జరుగుతోన్న డేనైట్​ టెస్టు నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ షేన్ వార్న్​ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ బృందం పింక్​ బంతి​తో ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీమిండియా పింక్​ బంతితో ఆడుతుందని ఆశిస్తున్నా:వార్న్​

By

Published : Nov 23, 2019, 4:12 PM IST

భారత్​- బంగ్లాదేశ్​ మధ్య ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా డేనైట్ టెస్టు జరుగుతోంది. ఇరుజట్లు గులాబి బంతి​తో ఆడటం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ ​ షేన్​ వార్న్​ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్​ బృందం డేనైట్​ టెస్టు ఆడతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"డేనైట్ టెస్టు ఆడేందుకు అంగీకారం తెలిపినందుకు గంగూలీ, కోహ్లీలకు అభినందనలు. వచ్చే వేసవిలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినపుడు అడిలైడ్ వేదికగా గులాబి బంతితో ఆడతారని అనుకుంటున్నా."

-షేన్ వార్న్, ఆసీస్ మాజీ ఆటగాడు

ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరభ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీలకు అభినందనలు తెలిపాడు మాజీ క్రికెటర్​ వార్న్​. ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైఖేల్ వాన్​ కూడా గంగూలీకి అభినందనలు తెలియజేశాడు.

టీమిండియా​ జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్​ కేటాయిస్తే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో పింక్​ బంతితో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.

ఇది చదవండి: పింక్​ టెస్టు: తొలిరోజు కోహ్లీసేనదే.. ఆధిక్యంలో భారత్​

ABOUT THE AUTHOR

...view details