సౌరభ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కీలక మార్పులు తీసుకు రాబోతున్నాడని, భారత్ ఆడిన తొలి డే/నైట్ టెస్టుతోనే తేలింది. దాదా.. సెలక్షన్ ప్యానెల్లోనూ బలమైన మార్పులు తీసుకురావాలని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న కమిటీని ప్రక్షాళన చేసి, శక్తిమంతమైన సభ్యులను తీసుకోవాలని ట్వీట్ చేశాడు.
"ఈ సెలక్షన్ ప్యానెల్‌ను మార్చాలి. శక్తిమంతమైన, అనుభవజ్ఞులైన వారిని సభ్యులుగా తీసుకురావాలి. గంగూలీ ఈ మార్పులు తీసుకువస్తాడని నేను అనుకుంటున్నా" -హర్భజన్ సింగ్, టీమిండియా సీనియర్ క్రికెటర్
అంతకు ముందు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే రీట్వీట్ చేస్తూ పై విధంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.