బిగ్‌బాష్ లీగ్ అంటేనే మెరుపు సిక్సర్లు, అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు, కళ్లుచెదిరే బౌలింగ్‌తో అలరిస్తుంది. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు దర్శనమిస్తున్నాయి. తాజాగా హొబర్ట్ హరికేన్స్-అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ రనౌట్ క్రికెట్ ప్రేమికుల మనసుల్ని గెలుచుకుంది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో తొమ్మిదో ఓవర్ వేసిన హొబర్ట్ బౌలర్ మెరిడిత్ అద్భుత రనౌట్‌తో మెప్పించాడు. మెరిడిత్ వేసిన బంతిని ఫ్లిప్ చేయబోయి మిస్సయ్యాడు మ్యాట్ రెన్షా. అది అతడి ముందే పడింది. అయినా సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఇది గమనించిన బౌలర్ వేగంగా వెళ్లి బంతిని కాలితో ఫుట్‌బాల్‌గా తన్ని వికెట్లను గిరాటేశాడు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది బీబీఎల్.