తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువ ఆటగాళ్లు వస్తారా.. సెలెక్టర్ల దారెటు? - ho-are-the-new-batsmen-that-india-could-try-on-the-west-indies-tour

నేడు వెస్టిండీస్​ పర్యటనకు టీమిండియా జట్టును ఎంపిక చేయనున్నారు సెలెక్టర్లు. ఎవరికి విశ్రాంతి ఇస్తారో.. ఎవరిని దూరం పెడతారో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇండియా

By

Published : Jul 21, 2019, 5:57 AM IST

ప్రపంచకప్​ సెమీఫైనల్లో ఓడిన టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు నేడు ఆటగాళ్లను ప్రకటించనుంది ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. ఎవరికి విశ్రాంతినిస్తారు.. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా అనే విషయాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్ సిరాజ్‌ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలుంది. వీరితో పాటు గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ప్రియాంక్‌ పంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, నవదీపై సైనీ, రాహుల్‌ చాహర్‌, కేఎస్‌ భరత్‌ వంటి యువ క్రికెటర్ల పేర్లను సైతం సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ధావన్ ఉంటాడా?

ప్రపంచకప్​లో గాయం కారణంగా వైదొలిగిన ధావన్ ఫిట్​నెస్​పై ఇంకా అనుమానాలున్నాయి. కొద్ది రోజుల క్రితం మళ్లీ బ్యాట్​ పట్టిన ఈ ఆటగాడికి జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. శిఖర్ స్థానంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్​ పేర్లు వినిపిస్తున్నాయి. ధోనీ స్థానంలో పంత్​కు స్థానం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

సైనీకు, రాహుల్ చాహల్​లకు చోటు లభిస్తుందా..?

మంచి వేగంతో పాటు కచ్చితత్వంలో బౌలింగ్ చేయగల నవీదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచకప్​ సమయంలో నెట్​ బౌలర్​గా కొనసాగాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్​, చాహల్​ వరల్డ్​కప్​లో ఆశించినంతగా రాణించలేకపోయారు. వీరికి ప్రత్యామ్నాయంగా యజువేంద్ర చాహల్ పేరు వినిపిస్తోంది.

ఆగస్టు 3న టీమిండియా విండీస్‌ పర్యటన ఆరంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలుత టీ20 సిరీస్ జరగనుంది.

ఇవీ చూడండి.. అంతర్జాతీయ క్రికెట్​లో ఓవర్​త్రోలపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details