తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ క్రెడిట్ అంతా కెప్టెన్​ మోర్గాన్​దే' - ఇయాన్​ మోర్గాన్​

పాక్​తో చివరి టీ20లో తాను బాగా బ్యాటింగ్ చేయడం వెనక కెప్టెన్​ మోర్గాన్ మద్దతు ఉందని చెప్పాడు మొయిన్ అలీ. ఈ మ్యాచ్​లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు ఈ ఆల్​రౌండర్.

He's the best captain I've had: Moeen Ali credits Morgan for success with bat
'ఆ ఇన్నింగ్స్​ క్రెడిట్​ అంతా అతడికే దక్కుతుంది'

By

Published : Sep 2, 2020, 12:07 PM IST

పాకిస్థాన్​తో చివరి టీ20లో తాను అద్భుత ఇన్నింగ్స్​ ఆడేందుకు కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ కారణమని అన్నాడు​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీ. అతడి​ మద్దతు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపాడు.

"నేను బాగా ఆడిన ఘనత అంతా కెప్టెన్ మోర్గాన్​కే దక్కుతుంది. వైస్​ కెప్టెన్​గా నాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నాకు చాలా మద్దతుగానూ నిలిచాడు. అతడు ఉత్తమ కెప్టెన్​ కావడానికి ఇది కూడా ఓ కారణం. మోర్గాన్ ఇచ్చిన​ మద్దతు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది"

- మోయిన్​ అలీ, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​

మాంచెస్టర్​లో జరిగిన చివరి టీ20లో 61 పరుగులు చేసి జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు మొయిన్ అలీ. ఐదు పరుగుల తేడాతో పాక్ విజయం సాధించడం వల్ల మోయిన్​ అలీ ఇన్నింగ్స్​ వృథా అయింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ డ్రాగా ముగిసింది. తొలుత బ్యాటింగ్​ చేసి పాక్​ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులను చేయగా, ఛేదనలో ఇంగ్లాండ్​ 8 వికెట్ల కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ABOUT THE AUTHOR

...view details