తెలంగాణ

telangana

ETV Bharat / sports

కామెంటరీ కోసం వచ్చి కోచ్ అయిపోయాడు! - కొలంబో కింగ్స్​ వార్తలు

వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడానికి శ్రీలంకకు వచ్చిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ హెర్షల్​ గిబ్స్​.. అదే టోర్నీలోని ఓ జట్టుకు అనూహ్యంగా కోచ్​ అయ్యాడు. ఈ సంఘటన లంక ప్రీమియర్ లీగ్​లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Herschelle Gibbs reaches Sri Lanka for commentary duties, lands coaching gig for LPL
కామెంటరీ చేయడానికి వస్తే కోచ్​గా ఎంపిక చేశారు!

By

Published : Nov 22, 2020, 1:12 PM IST

లంక ప్రీమియర్​ లీగ్​ (ఎల్​పీఎల్​)లోని కొలంబో కింగ్స్​ జట్టుకు ప్రధాన కోచ్​గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్​ హెర్షల్​ గిబ్ల్​ ఎంపికయ్యాడు. అయితే ఈ టోర్నీలో వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడానికి శ్రీలంక చేరుకున్న గిబ్స్​కు కోచ్​గా నియామాకం కావడం విశేషం.

పాత కోచ్​కు కరోనా

కొలంబో కింగ్స్​ ప్రధానకోచ్​గా డేవ్​ వాట్మోర్​ను నియమించారు. వ్యక్తిగత కారణాలతో లీగు నుంచి అతడు వైదొలగిన తర్వాత ఆ స్థానంలో కబీర్​ అలీను ఎంపిక చేశారు. ఇప్పుడు కబీర్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం గిబ్స్​ను కోచ్​గా నియమించుకుంది. సహాయ కోచ్​గా రంగన హెరాత్​ వ్యవహరించనున్నాడు.

గిబ్స్​ కెరీర్​

వన్డేల్లో ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్​మన్​ గిబ్స్​.. తన అంతర్జాతీయ క్రికెట్​లో 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20లు దక్షిణాఫ్రికా తరపున ప్రాతనిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 14 సెంచరీలు సహా 6,167 పరుగులు చేశాడు. వన్డేల్లో 8,094 పరుగులు​ సాధించాడు.

లంక ప్రీమియర్​ లీగ్​.. ఈ ఏడాది​ నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు జరగనుంది. ఇందులో ఆండ్రీ రసెల్​, షాహిద్​ అఫ్రిది, ఇర్ఫాన్​ పఠాన్​ లాంటి ప్రముఖ​ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details