ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో భారత్ 7వ స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2-1 తేడాతో ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా తాజా ర్యాకింగ్స్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన కోహ్లీసేన.. 3 విజయాలు, 3 ఓటములతో 29 పాయింట్లు సాధించింది.
ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్.. 4 మ్యాచ్‌ల్లో నెగ్గగా, మిగిలిన వాటిలో పరాజయం పాలైంది. మొత్తంగా 40 పాయింట్లు సాధించి ఈ లిస్టులో తొలి స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలిచిన ఆసీస్ 40 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 30 పాయింట్లతో కివీస్, అఫ్గానిస్తాన్.. 3, 4 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా, లంక జట్లు ఇంకా బోణీ కొట్టలేదు.