క్రికెట్లో ప్రత్యర్థి క్రికెటర్ల ఆట నచ్చడం.. వారి వ్యక్తిత్వాన్ని అభిమానించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌కు మాత్రం ప్రత్యర్థి ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ సెంటు నచ్చింది. అతడి అత్తరు వాసన బాగుందని మ్యాచ్ మధ్యలోనే పైన్ పొగిడాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో వికెట్ల వెనక ఉన్న టిమ్‌పైన్.. సెంటు బాగుందని రిజ్వాన్‌తో అన్నాడు. స్టంప్ మైక్ ద్వారా ఈ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో షేర్ చేసింది.