తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారతీయ డివిలియర్స్​ ఆ క్రికెటర్: హర్భజన్​ - సూర్య కుమార్ యాదవ్​ తాజా వార్తలు

యువ ఆటగాడు సూర్యకుమార్​ను ఏబీ డివిలియర్స్​గా పోల్చాడు సీనియర్​ స్పిన్నర్​ హర్భజన్​​. ఆస్ట్రేలియా పర్యటనకు అతడ్ని ఎంపిక చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

He is the Indian AB de Villiers said Harbhajan Singh on surya kumar yadav
అతడు ఇండియన్​ ఏబీ డివీలియర్స్​: హర్భజన్​

By

Published : Nov 13, 2020, 3:51 PM IST

ఈసారి ఐపీఎల్​ ట్రోఫీని ముంబయి గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో అతడి​ని ప్రశంసించాడు సీనియర్​ ఆటగాడు హర్భజన్​ సింగ్.​ సూర్యకుమార్​ను భారత డివిలియర్స్​ అని అభివర్ణించాడు. ఆసీస్ పర్యటనలో సూర్యకుమార్​ను ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.

"ముంబయి ఇండియన్స్​ తరఫున బ్యాటింగ్​లో సూర్య కుమార్​​ చాలా బాధ్యత తీసుకున్నాడు. మొదటి బంతి నుంచే మంచి స్ట్రైక్​రేట్​తో ఆడాడు. అన్ని రకాల షాట్లను చక్కగా ఆడగలడు. ఎలాంటి బౌలింగ్​నైనా సరే ఎదుర్కోగలడు. అతడు భారతీయ​ ఏబీ డివిలియర్స్. టీమ్​ఇండియాలోకి సూర్యకుమార్​ను ఎంపిక చేయాల్సిందని భావిస్తాను​"

-- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా సీనియర్​ క్రికెట్

ఈ సీజన్​లో 16 మ్యాచ్​లాడి 480 పరుగులు చేశాడు సూర్యకుమార్. 2018లో 512 పరుగులు చేసి జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. 2019లో 424 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గౌతమ్​ గంభీర్​, ఇయాన్​ బిషప్​, టామ్​ మూడీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసల్ని అందుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details