న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మంచి ప్రదర్శన చేశాడు. మిడిల్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టి వికెట్లు సాధించాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చాహల్ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
"రవీంద్ర జడేజా అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ సత్తా చాటలేకపోతున్నాడు. కానీ చాహల్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. అతడిని తుదిజట్టు నుంచి తప్పించకూడదు. బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టే కొన్ని ట్రిక్స్ అతడికి తెలుసు. అతడు పరిపూర్ణ లెగ్ స్పిన్నర్. బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించగలడు. అతడు ఎంతో తెలివైనవాడు. కుల్దీప్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. అతడు గేమ్‌లో ఉండట్లేదు. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. మిడిల్ ఓవర్లలో చాహల్ మినహా ఎవరూ వికెట్లను తీయలేకపోతున్నారు."