తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ కీలక పాత్ర పోషించాడు. అద్భుత బౌలింగ్ నైపుణ్యంతో గిల్, రహానె, పంత్‌లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆసియా పరిస్థితుల్లో అండర్సన్, స్టెయిన్ల ప్రదర్శనలను పోల్చడంపై సరదాగా స్పందించాడు స్టెయిన్.
"ఇప్పుడు అవసరమైన పోలిక ఏంటంటే.. జిమ్మీ (అండర్సన్) ఇంకా దూసుకుపోతుంటే.. నేను మాత్రం నా సోఫాలో కూర్చుని మ్యాచ్ చూస్తున్నా. అతడు ఓ దిగ్గజం. వయసు పెరిగే కొద్దీ మరింత గొప్పగా రాణిస్తున్నాడు." అని స్టెయిన్ ట్వీట్ చేశాడు.