తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా బౌలింగ్​లో ఆడటం కష్టమే: కివీస్ బ్యాటింగ్ కోచ్ - cricket news

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కష్టమేనని అన్నాడు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టీడ్. ఈరోజు ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్​ను 3-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

బుమ్రా బౌలింగ్​లో ఆడటం కష్టమే: కివీస్ బ్యాటింగ్ కోచ్
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్

By

Published : Jan 31, 2020, 11:31 AM IST

Updated : Feb 28, 2020, 3:34 PM IST

టీమిండియాపై న్యూజిలాండ్ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం భారత్‌ అద్భుతంగా ఆడుతోందని, ఆ జట్టులో అందరూ విజేతలేనని అన్నాడు. బుమ్రాను ఎదుర్కోవడం తమ బ్యాట్స్​మెన్​కు కష్టమవుతోందని చెప్పాడు.

"టీమిండియా అద్భుతమైన జట్టు. జట్టులో టాప్‌ నుంచి చివరివరకు ఎంతో పటిష్ఠంగా ఉంది. అందరూ మ్యాచ్‌ విజేతలని ఐపీఎల్‌లోనే నిరూపించారు. ఆ టోర్నీలో ఒత్తిడిలో వారు అదరగొట్టేవారు. ఆ అనుభవంతో కఠిన సమయాల్లోనూ గొప్పగా ఆడుతున్నారు. తర్వాత మ్యాచ్‌లో, రానున్న సిరీస్‌ల్లోనూ వారు గొప్పగా ఆడతారని భావిస్తున్నా. బుమ్రా బౌలింగ్‌ ఎంతో కఠినంగా ఉంటుంది. అతడిని ఎదుర్కోవడం కష్టతరమే. కానీ అదృష్టవశాత్తూ మేం మూడో మ్యాచ్‌లో సమర్థమంతంగా ఎదుర్కొన్నాం. బుమ్రాపై విలియమ్సన్ ఆధిపత్యం చెలాయించాడు. కేన్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. మేం మరింత రాణించాల్సి ఉంది" -గ్యారీ స్టీడ్, కివీస్ బ్యాటింగ్ కోచ్

బుధవారం జరిగిన మూడో టీ20లో గెలిచిన భారత్.. ఈ సిరీస్​ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్​ తొలుత టై అయింది. సూపర్‌ఓవర్‌లో రోహిత్‌ విజృంభించి ఆడి టీమిండియాను గెలిపించాడు. వెల్లింగ్టన్‌ వేదికగా ఈ రోజు ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ జరగనుంది.

Last Updated : Feb 28, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details