టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాజ్యంపై స్పందించాలని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది పంజాబ్, హరియాణా హైకోర్టు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కోర్టులో యువీ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై తమ స్పందన తెలియజేయాలని ఫిర్యాదు దారు సహా సర్కారు, పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.
యువరాజ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో స్పందించాలని సంబంధిత వర్గాలకు చెప్పింది.