ఐపీఎల్లో తాను మాంగూస్ బ్యాట్ వాడటం ధోనీకి ఇష్టముండేది కాదని చెప్పాడు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్. 2010లో ఈ బ్యాట్‌ను ఉపయోగించి, వార్తల్లో నిలిచాడీ బ్యాట్స్‌మన్. చెన్నైసూపర్‌కింగ్స్‌తో తాజాగా నిర్వహించిన లైవ్ వీడియో చాట్‌లో మాట్లాడుతూ ఈ సంఘటన వెనకున్న ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
'ధోనీ నన్ను ఆ బ్యాట్ వాడొద్దని చెప్పాడు' - Dhoni LATEST NEWS
ఐపీఎల్-2010లో మాంగూస్ బ్యాట్‌ను పరిచయం చేసిన హేడెన్.. దీనిని తాను వినియోగించడంపై ధోనీకున్న అయిష్టతను వెల్లడించాడు.
!['ధోనీ నన్ను ఆ బ్యాట్ వాడొద్దని చెప్పాడు' Hayden recalls Dhoni's reaction on 'mongoose bat'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7128838-923-7128838-1589020992637.jpg)
మాజీ క్రికెటర్ మథ్యూ హేడెన్
నువ్వు ఏమడగినా కాదనను, కానీ మ్యాచ్‌లో ఈ బ్యాట్ మాత్రం వాడకు అని ధోనీ తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు హేడెన్. ఆ సీజన్లో తొలిసారి దిల్లీతో మ్యాచ్ సందర్భంగా దీనితో ఆడి, 43 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఆ ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ముంబయిని ఓడించి, చెన్నై కప్పు గెలుచుకుంది.