తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అనుష్క నుంచి ఆ రెండు విషయాలు నేర్చుకున్నా' - cricket news

భార్య అనుష్క శర్మ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనలోని మార్పులకు ఆమె కారణమైందని అన్నాడు.

'అనుష్క నుంచి ఆ రెండు విషయాలు నేర్చుకున్నా'
కోహ్లీ అనుష్క

By

Published : Apr 22, 2020, 1:26 PM IST

టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. కెరీర్​ ప్రారంభంలో దూకుడుగా ఉండేవాడు. తనను కవ్వించే ప్రత్యర్థి ఆటగాళ్లతో అదే విధంగా వ్యవహరించేవాడు. అయితే 2014లో టెస్టు పగ్గాలు అందుకున్న తర్వాత నుంచి ఆ స్వభావాన్ని మార్చుకుంటూ వచ్చాడు. అయితే తనలోని ఈ మార్పులకు భార్య అనుష్క శర్మనే కారణమని చెప్పాడు. మంగళవారం జరిగిన ఆన్​లైన్ చాట్ సెషన్స్​లో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

"నా ఓపిక విషయంలో క్రెడిట్ మొత్తం అనుష్కకే దక్కుతుంది. ఆమెతో పరిచయం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. తన వ్యక్తిత్వం, పరిస్థితుల్ని డీల్ చేసే విధానాల్ని చూసి ప్రశాంతంగా, సహనంగా ఎలా ఉండాలో నేర్చుకున్నా" -కోహ్లీ, టీమిండియా కెప్టెన్

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

దీనితో పాటే తన కెరీర్​ ప్రారంభంలో ఎదురైన సంఘటన గురించి చెప్పాడు విరాట్. బాగా ఆడినా, తొలిసారి రాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఆ రోజు రాత్రి 3 గంటల వరకు ఏడుస్తూనే కూర్చున్నానని వెల్లడించాడు.

2006లో దిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కోహ్లీ.. 2008లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం టీమిండియాకు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటివరకు 86 టెస్టుల్లో 7240 పరుగులు, 248 వన్డేల్లో 11867 పరుగులు, 82 టీ20ల్లో 2794 పరుగులు చేసి లెక్కలేనన్ని రికార్డులను నమోదు చేశాడు.

భారత్​లో లాక్​డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న కోహ్లీ-అనుష్క.. పలు రకాల వీడియోలను పోస్ట్ చేసి అభిమానుల్ని అలరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details