తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాయ్ 'షూ' ఊడింది- స్టేడియం నవ్వులమయమైంది - రాయ్ 'షూ' ఊడింది.. స్టేడియం నవ్వులమయమైంది

ఐర్లాండ్​తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఓపెనర్ రాయ్​ పొరపాటు వల్ల అతడి షూ ఊడిపోయింది. ఐర్లాండ్​ బౌలర్ మార్క్ అడైర్ వేసిన బంతిని ఆడబోయే ప్రయత్నంలో ఇది జరిగింది.

రాయ్

By

Published : Jul 27, 2019, 7:30 PM IST

వన్డేల్లో విధ్వంసకర ఓపెనర్​.. ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్​ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు.. అదే జోరుతో టెస్టుల్లోనూ సత్తాచాటదామని సిద్ధమయ్యాడు ఓపెనర్ జేసన్ రాయ్. ఐర్లాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్​తో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్​లో 5 పరుగులు చేసి నిరాశపర్చినా, రెండో​ ఇన్నింగ్స్​లో సత్తాచాటాడు. ఈ మ్యాచ్​లో ఇతడి బ్యాటింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రోల్​ అవుతోంది.

అసలేం జరిగింది..?

రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 38వ ఓవర్ బ్యాటింగ్ చేస్తుండగా మార్క్ అడైర్ బౌలింగ్ వేశాడు. ఐదో బంతిని బౌండరీకి తరలిద్దామనుకున్న రాయ్ క్రీజు దాటి ముందుకొచ్చి ఆడాడు. ఆ ప్రయత్నంలో అతడి​ కుడి కాలి షూ ఊడిపోయింది. ఫలితంగా మైదానంలో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూశాయి.

అరంగేట్ర ఇన్నింగ్స్​లో విఫలమైన రాయ్​.. సెకండ్ ఇన్నింగ్స్​లో 72 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. నైట్ వాచ్​మెన్ జాక్ లీచ్​తో కలిసి రెండో వికెట్​కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇవీ చూడండి.. 'లసిత్ మలింగ... ఓ మ్యాచ్ విన్నర్'

ABOUT THE AUTHOR

...view details