తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​కు ఆమ్లా గుడ్​ బై - hashim amla

దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాట్స్​మెన్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

ఆమ్లా

By

Published : Aug 8, 2019, 9:50 PM IST

హషీమ్ ఆమ్లా.. ఈ పేరు వినగానే ముఖ్యంగా గుర్తొచ్చేది డిఫెన్స్​. ఎలాంటి బౌలర్​నైనా సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్న ఈ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్​మెన్​ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సఫారీ జట్టు తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆమ్లా పలు రికార్డులను నమోదు చేశాడు.

15 ఏళ్ల క్రికెట్ కెరీర్​లో 349 మ్యాచ్​లు ఆడిన ఆమ్లా అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 88 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్, ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన సఫారీ ఆటగాడిగా నిలిచాడు.

ఆమ్లా

వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేలు, 3 వేలు, 4 వేలు, 5 వేలు, 6 వేలు, 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఆమ్లా. అలాగే సౌతాఫ్రికా తరఫున అత్యధికంగా 27 సెంచరీలు సాధించాడు.

ఇవీ చూడండి.. పంజాబ్​ కోచ్​ పదవికి హెసన్ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details