ఒడిశా కటక్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీలో భారత జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి సారథ్యం వహించనున్నారు. భారత్-ఏ, బీ, సీ జట్ల మధ్య జనవరి 4 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగనుంది.
సోమవారం మహిళల సెలక్షన్ కమిటీ ఈ మూడు జట్లను ప్రకటించింది. ఒక్కో జట్టులో 14మంది ప్లేయర్లను ఎంపిక చేసింది.
జట్లు..
భారత్-ఏ:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), తానియా భాటియా(వికెట్ కీపర్), శివాలి శిందే(కీపర్), జాసియా అక్తర్, ప్రియా పునియా, దీప్తి శర్మ, దేవిక వైద్య, స్నేహా రానా, మానసి జోషి, మేఘనా సింగ్, కోమల్ ఝాంజఢ్, మీను మణి, రాధా యాదవ్, భారతి ఫుల్మాలి.