తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా క్రికెటర్​ హర్మన్​ప్రీత్​కు కరోనా

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్​ప్రీత్ కౌర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంది.

Harmanpreet Kaur tests positive for COVID-19
హర్మన్​ప్రీత్​కు కరోనా

By

Published : Mar 30, 2021, 10:55 AM IST

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్మన్​ప్రీత్ కౌర్ కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఆమె సమీప బంధువులు తెలియజేశారు. ప్రస్తుతం హర్మన్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఆమెకు కరోనా ఎలా వచ్చిందో అనేదానిపై స్పష్టత లేదని తెలిపారు.

ఇప్పటికే టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్ కరోనా బారినపడ్డారు. వీరందరూ రోడ్ సేఫ్టీ సిరీస్​లో ఇండియ్ లెజెండ్స్​కి ప్రాతినిధ్యం వహించారు. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్​పై గెలిచి సచిన్ సేన విజేతగా నిలిచింది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​లో పాల్గొంది హర్మన్​ప్రీత్. ఈ సిరీస్​ను 4-1 తేడాతో కోల్పోయింది భారత జట్టు. చివరి వన్డే జరుగుతోన్న సమయంలో గాయపడిన హర్మన్​.. తర్వాత జరిగిన టీ20 సిరీస్​లో పాల్గొనలేదు. ఈ సిరీస్​ను కూడా 2-1 తేడాతో కోల్పోయింది టీమ్ఇండియా.

ABOUT THE AUTHOR

...view details