టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య భార్య నటాషా శుక్రవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడి తొలి చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. "దేవుడి ఆశీర్వాదం" అంటూ రాసుకొచ్చాడు పాండ్య. చిన్నారి ఫొటో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
వారసుడి తొలి ఫొటోను పోస్ట్ చేసిన పాండ్య - hardik pandya baby photos
శుక్రవారం తండ్రి అయిన టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. తన వారసుడి తొలి ఫొటోనూ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ చిత్రానికి కామెంట్లు పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

పాండ్య
దుబాయ్లో ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా నటాషా, పాండ్యల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే తన భార్య గర్భవతి అయినట్లు ప్రకటించాడు పాండ్య. అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పెడుతూ వచ్చాడు.