న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును మంగళవారం ప్రకటించింది. యువ బ్యాట్స్‌మన్ పృథ్వీషాకు చోటు దక్కించుకోగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానం సంపాదించలేకపోయాడు. హార్దిక్ ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్లే కివీస్‌తో వన్డేలకు అతడిని ఎంపిక చేయలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
"ఫిట్‌నెస్ పరీక్షలో విజయం సాధిస్తాడని హార్దిక్ భావించాడు. కానీ, అతడు తన ఫిట్‌నెస్ ట్రైనర్ రజనీకాంత్ నిర్వహించిన పరీక్షలో విఫలమయ్యాడు. యోయో టెస్టు, బౌలింగ్ ఫిట్‌నెస్ గురించి కాదు. అతడు 'వర్క్‌లోడ్ టెస్టు'లోనే విఫలమయ్యాడు. అంటే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని అర్థం" - బీసీసీఐ ఉన్నతాధికారి
వెన్ను గాయానికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత అతడు జట్టుకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. గత నెల నుంచి తిరిగి సాధన మొదలుపెట్టాడు. కానీ, ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయాడు. ఇటీవల ముంబయిలో పాండ్యను కోచింగ్ బృందం పరీక్షించగా అతడు బౌలింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత్-ఏ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. పూర్తిఫిటెనెస్ సాధిస్తే కివీస్ పర్యటనకు అతడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. అందుకే టీమిండియా ఎంపిక కార్యక్రమాన్ని ఆలస్యం చేసిందని వార్తలు వచ్చాయి. కానీ, హార్దిక్ 'వర్క్‌లోడ్ టెస్టు'లోనూ విఫలం కావడం వల్ల అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారని తెలుస్తోంది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమిండియాలోకి హార్దిక్ తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. ఈనెల 24 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది.
ఇది చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టిదే