హార్దిక్ పాండ్య.. ప్రత్యర్థి ఎలాంటి బౌలరైనా సమర్థమంతంగా ఎదుర్కోగలడు. బంతి ఎంత వేగంగా వచ్చినా సరే అమాంతం స్టాండ్స్‌లోకి పంపించే సామర్థ్యం అతడి సొంతం. అయితే అదేమి అనుకోకుండా వచ్చిన ప్రతిభ కాదు. అందుకోసం చాలానే శ్రమించాడు. తాజాగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్. అందులో బంతిని బౌండరీ నలువైపులా బాదుతూ కనిపించాడు.
" ఈ రోజు నెట్ సెషన్ అద్భుతంగా సాగింది. కుర్రాళ్లను (టీమిండియా సహచరులు) కలిసేందుకు ఆతృుతగా ఉన్నా". - హార్దిక్ పాండ్య, భారత క్రికెటర్
ప్రపంచకప్ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకున్న హార్దిక్.. సఫారీలతో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. అందుకోసం నెట్స్‌లో శుక్రవారం కఠోర సాధన చేశాడు. హెలికాప్టర్ షాట్లు ఆడుతూ కనిపించాడు.
తేదీ | మ్యాచ్ | వేదిక |
సెప్టెంబర్-15 | తొలి టీ20 | ధర్మశాల |
సెప్టెంబర్-18 | రెండో టీ20 | మొహాలీ |
సెప్టెంబర్-22 | మూడో టీ20 | బెంగళూరు |
అక్టోబర్ 2-6 | తొలి టెస్టు | విశాఖపట్నం |
అక్టోబర్ 10-14 | రెండో టెస్టు | పూణె |
అక్టోబర్ 19-23 | మూడో టెస్టు | రాంచి |
ఇది చదవండి: 'విజ్ఞాన శాస్త్రంలో ఓటమి లేదు.. విజయం తప్ప'