తెలంగాణ

telangana

ETV Bharat / sports

నడక నేర్చుకుంటున్న హార్దిక్ పాండ్య​..! - Baby steps .. but my road to full fitness begins here and now 💪 Thank you to everyone for their support and wishes, it means a lot

టీమిండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య.. ఇటీవలే వెన్నులో గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు.

వీల్​ఛైర్​లో వీడియో పంచుకున్న హార్దిక్

By

Published : Oct 9, 2019, 1:52 PM IST

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. వెన్నులో గాయం కారణంగా లండన్​లో సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఈ క్రికెటర్​... వ్యక్తిగత పర్యవేక్షకుడి సాయంతో నడవడం ప్రాక్టీసు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

" పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి బేబీ స్టెప్స్(చిన్న చిన్న అడుగులు)తో నా ప్రయాణం ప్రారంభించాను. త్వరలోనే మైదానంలో అడుగుపెడతా. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు". -- హార్దిక్​ పాండ్య, యువ క్రికెటర్

హార్దిక్‌.. గత ఏడాది ఆసియా కప్‌ నాటి నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న పాండ్య.... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇటీవలే మళ్లీ గాయం తిరగబెట్టడం వల్ల ఆ సిరీస్​ మధ్యలోనే లండన్​ వెళ్లాడు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్న ఈ క్రికెటర్ కోలుకునేందుకు మరికొంత సమయం పట్టొచ్చు.

ABOUT THE AUTHOR

...view details