క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇంట్లో విషాదం - హార్దిక్ పాండ్య వార్తలు
09:55 January 16
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య గుండెపోటు రావడం వల్ల మరణించారు. శనివారం(జనవరి 16) తుదిశ్వాస విడిచారు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న కృనాల్ పాండ్య హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయమై బరోడా క్రికెట్ అసోసియేషన్ ఆయన మృతికి సంతాపం తెలిపింది.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి స్వదేశానికి తిరిగొచ్చాడు హార్దిక్ పాండ్య. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఇతడు.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ సిరీస్ల కోసం సిద్ధమవుతున్నాడు.