ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ గడ్డపై మాత్రమే తలపడిన టీమిండియా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌తో జరిగిన పలు సిరీస్‌లను స్వదేశంలోనే ఆడింది. ఈ ఏడాది ఆడిన మొదటి టీ20 సిరీస్.. ఇక్కడే జరిగింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న 'మెన్ ఇన్ బ్లూ'... తొలిసారి విదేశీ గడ్డపైనా కాలు మోపనుంది. జనవరి 24 నుంచి దాదాపు ఆరు వారాలు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో... మొత్తం ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడతుంది భారత జట్టు.
కివీస్‌తో ఎనిమిది పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడనుంది భారత్. ఈ నేపథ్యంలో సెలక్టర్లు 15 మంది బదులు 16 లేదా 17 మందితో జట్టును ప్రకటించాలని భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు యువకులకు ఎక్కువ అవకాశాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భారత్-ఏ జట్టు.. షాడో పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. అంటే ఈ మ్యాచ్‌ల్లో ఆడిన యువ ఆటగాళ్లను అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు.
హార్దిక్ పూర్తిగా ఔట్!
న్యూజిలాండ్-ఏ జట్టుపై ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే హార్దిక్ పాండ్యను సీనియర్ జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఈ సిరీస్‌కు వెళ్లేముందు ఫిట్నెస్ టెస్టులో ఫెయిలయ్యాడు ఈ యువ ఆల్‌రౌండర్. ఇతడి స్థానంలో విజయ్ శంకర్ ఎంపికయ్యాడు. భారత్-ఏ సిరీస్ ఈనెల 26న ముగుస్తుంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ఇతడు ఎక్కువగా శ్రమించాల్సి ఉంది. ఫిట్నెస్ టెస్టు కంటే యోయో టెస్టు కష్టమైనది కాబట్టి ఇతడి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత వెన్నుగాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి జట్టుకు దూరమయ్యాడు హార్దిక్.
జాదవ్‌కు అదృష్టమే రక్ష