తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాండ్య ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు' - Brad Hogg about Ben Stokes

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యను ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​తో పోల్చొద్దని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. స్టోక్స్​తో పోల్చేంత క్రికెట్ పాండ్య ఆడలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పాండ్య
పాండ్య

By

Published : Mar 24, 2020, 5:08 PM IST

టీమ్​ఇండియాకు ఎంపికైన కొద్ది కాలంలోనే మంచి ఆల్​రౌండర్​గా పేరు తెచ్చుకున్నాడు హార్దిక్ పాండ్య. కొందరు ఈ యువ ఆటగాడిని కపిల్​ దేవ్​తో పోల్చారు. మరికొందరు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ కంటే ఉత్తమ క్రికెటర్ అని అన్నారు. కానీ పాండ్యకు ఇంకా అంత అనుభవం రాలేదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన నిర్ణయం తెలిపాడు.

బ్రాడ్ హాగ్

"హార్దిక్​ గొప్ప సత్తా ఉన్న క్రికెటర్. కానీ స్టోక్స్​తో పోల్చేంత అంతర్జాతీయ క్రికెట్ పాండ్య ఆడలేదు. నా ప్రపంచకప్​ అత్యుత్తమ ఎలెవన్ జట్టులో ఆల్​రౌండర్​గా స్టోక్స్​కే మొగ్గు చూపుతా."

-బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్

2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు పాండ్య. అనతికాలంలోనే తనదైన శైలి ఆటతో ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న పాండ్య.. దక్షిణాఫ్రికాతో సిరీస్​కు ఎంపికయ్యాడు. కానీ ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్​ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. మిగిలిన రెండు మ్యాచ్​లు కరోనా కారణంగా రద్దయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details