తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మైదానంలో అడుగుపెట్టడం గొప్ప అనుభూతి' - Hardik Pandya back on the field shares video

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. ట్విట్టర్​లో ఓ వీడియోను షేర్ చేశాడు. గాయం నుంచి కోలుకుని మైదానంలో కసరత్తులు చేస్తూ కనిపించాడు.

Hardik Pandya
హార్దిక్

By

Published : Nov 28, 2019, 8:59 AM IST

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయం నుంచి తిరిగి కోలుకుంటున్నాడు. పూర్తి ఫిటెనెస్ అందుకోవడానికి మైదానంలో, జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే నెట్టింట్లో ఇది వైరల్‌గా మారింది.

"బరిలోకి దిగి చాలా రోజులైంది. దీని కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు" అని ట్వీట్‌ చేశాడు పాండ్య.

వెన్ను గాయంతో హార్దిక్‌ పాండ్య.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​ల​కు దూరమ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ఇవీ చూడండి.. 'వారి పేరిట ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు'

ABOUT THE AUTHOR

...view details