తెలంగాణ

telangana

ETV Bharat / sports

కాబోయే భార్యకు హార్దిక్ పాండ్య హిందీ పాఠాలు - sports news

తనకు కాబోయే సతీమణి నటాషాకు హిందీ నేర్పిస్తూ కనిపించిన హార్దిక్ పాండ్య వీడియో వైరల్​గా మారింది. ఇందులో తెగ ఆనందపడిపోతూ కనిపించాడీ క్రికెటర్.

కాబోయే భార్యకు హార్దిక్ పాండ్య హిందీ పాఠాలు
క్రికెటర్ హార్దిక్ పాండ్య

By

Published : Apr 14, 2020, 6:45 PM IST

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య, తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్‌కు హిందీ పాఠాలు నేర్పిస్తూ కనిపించాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని వీరిద్దరూ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.​

ఈ వీడియోలో భాగంగా సోఫా మీద కూర్చున్న హార్దిక్‌‌, నటాషాను "బేబీ, మే క్యా హు తేరా?" (నేను నీకు ఏమవుతాను?) అని ప్రశ్నిస్తాడు. ఇందుకు ఆమె వచ్చీరాని హిందీలో "జిగ్రా కా టుక్‌డా" (నా హృదయానివి) అని ఇచ్చిన సమాధానానికి పాండ్య తెగ మురిసిపోతాడు. ఈ సరదా వీడియో క్రికెట్‌ అభిమానులనే కాకుండా నెటిజన్లందరినీ అలరిస్తోంది.

నూతన సంవత్సరం తొలిరోజున, సముద్రం మధ్యలో తన ప్రేయసికి ఉంగరంతో ప్రపోజ్‌ చేశాడు హార్దిక్. అనంతరం ఆమె అంగీకారం తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరితో పాటు పాండ్య సోదరుడు కృనాల్‌ పాండ్య, ఆయన భార్య పంఖుడీ శర్మలు ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 9 గంటలు-9 నిముషాలు కార్యక్రమానికి మద్దతు తెలిపి ఆ చిత్రాలతో సందడి చేశారు.

నటాషాతో హార్దిక్ పాండ్య

ABOUT THE AUTHOR

...view details