టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా గర్భవతిగా ఉన్న ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు.
"మా ఇద్దరి జీవిత ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. త్వరలోనే మా జీవితంలోకి మరొకరిని ఆహ్వానించబోతున్నాం. ఈ విషయం మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు కోరుతున్నాను."
-హార్దిక పాండ్య, టీమ్ ఇండియా ఆల్ రౌండర్.