తెలంగాణ

telangana

ETV Bharat / sports

20 సిక్స్​లు కొడతానని అనుకోలేదు: హార్దిక్ - Hardik Pandya Injury

గాయం నుంచి కోలుకుని దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య. జట్టుకు దూరంగా ఉన్న సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యానని, ఆ తర్వాత డీవై పాటిల్​ టోర్నీలో ఆడిన ఓ మ్యాచ్​లో 20 సిక్స్​లు కొడతానని అనుకోలేదన్నాడు.

పాండ్య
పాండ్య

By

Published : Mar 13, 2020, 8:19 AM IST

గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా ఆల్​రౌంర్ హార్దిక్ పాండ్య.. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట. ఆ దశ నుంచి కోలుకోవడం పెద్ద సవాలుగా మారిందని అన్నాడు.

"కొన్ని నెలలుగా భారత్‌ తరఫున ఆడే అవకాశాన్ని కోల్పోయా. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసే దశలో చాలా ఒత్తిడికి గురయ్యా. నాకిదో పెద్ద సవాల్‌గా అనిపించింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి చాలా ప్రయత్నించా. ఈ సమయంలో ఎంతో మానసిక వేదన అనుభవించా. ఈ దశలో నా సన్నిహితులు ఎంతో సాయం చేశారు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపడా ఫిట్‌నెస్‌ సాధించడానికి డీవై పాటిల్‌ టోర్నీ బాగా ఉపయోగపడింది. ఈ టోర్నీలో సులభంగా సిక్స్‌లు కొట్టడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక మ్యాచ్‌లో 20 సిక్స్‌లు బాదుతానని అస్సలు ఊహించలేదు"

-హార్దిక్ పాండ్య, టీమిండియా ఆల్​రౌండర్

గాయం నుంచి కోలుకుని డీవై పాటిల్ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్​లతో ఆకట్టుకున్నాడు పాండ్య. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​ ఆడుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details