హర్భజన్ తమ జట్టుతో చేరడం వల్ల స్పిన్ విభాగం బలోపేతమవుతుందని తెలిపాడు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. అన్ని ఫ్రాంఛైజీల్లో కెల్లా తమ టీమ్‌లోనే అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని వెల్లడించాడు. 'మేము చెన్నైలో ఆడనున్నాం. అక్కడ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తే.. మేము టోర్నీలో ముందంజలో ఉన్నట్లే' అని మోర్గాన్ పేర్కొన్నాడు.
చెన్నై మొత్తం మూడు సార్లు ట్రోఫీ సాధించగా.. అందులో రెండు సార్లు సీఎస్కే తరఫున ఆడిన అనుభవం భజ్జీ సొంతం. అలాంటిది ప్రస్తుత సీజన్ తొలి రౌండ్ వేలంలో భజ్జీని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్లో బేస్ ప్రైజ్‌కు దక్కించుకుంది కోల్‌కతా జట్టు.
భారత్‌తో వన్డే సిరీస్‌కు, ఐపీఎల్‌కు మధ్య తగినంత ఖాళీ సమయం ఉండడం తనకు కలిసొచ్చిందని తెలిపాడు మోర్గాన్. గాయం నుంచి కోలుకోవడానికి ఈ సమయం ఉపయోగపడిందని పేర్కొన్నాడు.