చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. సూపర్ కింగ్స్ బౌలర్లు సమష్టిగా రాణించి గెలుపులో కీలకపాత్ర పోషించారు. హర్భజన్, తాహిర్ వైన్ లాంటోళ్లని మ్యాచ్ అనంతరం ధోని అన్నాడు.
"ప్రతి మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు. హర్భజన్, తాహిర్ వైన్‌లా రోజురోజుకూ పరిణతి చెందుతున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణిస్తున్నారు. ఫ్లాట్ వికెట్‌పై బాగా ఆలోచించి కాంబినేషన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. తాహిర్ నేను చెప్పినట్టు చేస్తాడు. ఎక్కడ బంతి వేస్తే మంచి ఫలితాలు వస్తాయో చెబితే అలానే చేస్తాడు. తద్వారా మేం మంచి ఫలితాలు రాబట్టాం.