ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న రెండేళ్ల ఒప్పంద గడువు కాలం పూర్తయిందని ప్రకటించాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. సీఎస్కేతో సాగిన ప్రయాణంలో గొప్ప అనుభవాలు, మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని ట్వీట్ చేశాడు.
"సీఎస్కేతో నా ఒప్పందం గడువు ముగిసింది. ఈ జట్టు తరఫున ఆడటం ఓ గొప్ప అనుభవం. ఈ ఫ్రాంచైజీతో సాగిన ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప స్నేహితులు దొరికారు. దేన్ని ఎప్పటికీ మరిచిపోను. చెన్నై జట్టు మేనేజ్మెంట్, స్టాఫ్, అభిమానులందరికీ నా ధన్యావాదాలు."