తెలంగాణ

telangana

ETV Bharat / sports

భజ్జీ వల్లే ఆ సిరీస్​లో ఓడాం: స్టీవ్‌ వా - భజ్జీపై స్టీవ్ వా

టీమ్​ఇండియా క్రికెటర్​ హర్భజన్​ సింగ్ అందరిలాంటి స్పిన్నర్‌ కాదని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా అంటున్నాడు. హర్భజన్ ఆటతీరు విభిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 2001లో ఆసీస్​తో ఆడిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా గెలవడానికి ఏకైక కారణం భజ్జీ అని అన్నాడు.

harbhajan singh won the 2001 series for india
2001.. ఓడామంటే భజ్జీ వల్లే: స్టీవ్‌వా

By

Published : Jan 15, 2021, 9:46 AM IST

Updated : Jan 15, 2021, 10:34 AM IST

టీమ్ఇండియాతో 2001లో జరిగిన టెస్టు సిరీస్​ తాము పరాజయానికి ప్రధాన కారణంగా స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ స్టీవ్​ వా అన్నాడు. అతడి అదనపు స్పిన్‌, బౌన్స్‌కు తమ వద్ద జవాబే లేదని చెప్పాడు. భజ్జీ సంప్రదాయ స్పిన్నర్‌ కాదని, భిన్నమైన వాడని ప్రశంసించాడు. ఒక ఇంటర్వ్యూలో స్టీవ్‌వా 2001 సిరీస్ గురించి మాట్లాడాడు.

స్టీవ్ వా

"2001లో టీమ్‌ఇండియాకు సిరీస్ ‌అందించింది హర్భజన్‌ సింగ్‌. మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌన్స్‌కు మా వద్ద జవాబే లేదు. లెంగ్త్‌కు తోడుగా అద్భుతమైన బౌన్స్‌ అతడి సొంతం. ప్రతి స్పెల్‌లో అతడు మాపై ఆధిపత్యం చెలాయించాడు. అతడికి మంచి స్ట్రైక్‌రేట్‌ ఉంది. ఎన్ని ఓవర్లు బౌలింగ్​ చేసినా నిలకడ కోల్పోయేవాడు కాదు. భజ్జీని హెడేన్‌ బాగానే ఎదుర్కొన్నా మిగతా జట్టు విఫలమైంది. అతడే లేకుంటే మేం సిరీస్‌ గెలిచేవాళ్లం. మాపై అతడికి మెరుగైన రికార్డుంది"

- స్టీవ్‌ వా, ఆస్ట్రేలియా మాజీ సారథి

భజ్జీ అందరిలాంటి స్పిన్నర్‌ కాడని స్టీవ్‌ వా ప్రశంసించాడు. బౌన్స్‌తోనే వైవిధ్యం ప్రదర్శించేవాడని తెలిపాడు. అతడి బౌలింగ్‌లో తరచూ బ్యాటు, ప్యాడ్‌కు బంతి తగిలి క్యాచ్‌ ఔట్లు అయ్యేవాళ్లమని పేర్కొన్నాడు.

"మేమెలాంటి దృక్పథంతో ఆడతామో హర్భజన్‌ సైతం అలాగే ఆడతాడు. మాలోని స్ఫూర్తి, కసి, పట్టుదల అతడిలో కనిపించేవి. మాతో మేమే ఆడినట్టు ఆడినట్టు అనిపించేది. అందుకే మేం ఔటయ్యేవాళ్లం. అతడి మాట, ఆట, దూకుడు, సానుకూలత అన్నీ ఆసీస్ తరహాలోనే ఉండేవి" అని స్టీవ్​ వా పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:బాబర్ అజామ్​పై లైంగిక దాడి కేసు నమోదు

Last Updated : Jan 15, 2021, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details