కరోనా లాక్డౌన్ కారణంగా క్రికెటర్లు ఇంటి వద్ద వారికి తోచిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటూ పోస్టులు పెడుతున్నాడు. తాజాగా ఐపీఎల్లో తాను బాదిన హ్యాట్రిక్ సిక్సుల వీడియోను నెట్టింట షేర్ చేశాడు.
భజ్జీ హ్యాట్రిక్ సిక్సులు.. మరోసారి చూసేయండి - Against Kings XI Punjab
టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఐపీఎల్ 2015 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాదిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
హర్భజన్
2015 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ హ్యాట్రిక్ సిక్సులు బాదాడు. పంజాబ్ బౌలర్ అనురీత్ సింగ్ వేసిన ఓవర్లో ఇలా వరుస బౌండరీలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో భజ్జీ కేవలం 24 బంతుల్లోనే 64 బంతులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 ఫోర్లు 6 సిక్సులు ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమిపాలైంది.
Last Updated : Aug 12, 2020, 4:51 PM IST