కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే సుమారు 89లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 4లక్షలకుపైగా మంది మరణించారు. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఎవరికి వారు తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ శనివారం ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో.. 20 సెకన్ల పాటు వ్యాయామం చేసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలనే విషయాన్ని తెలియజేశాడు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎవరికీ సాధ్యంకాని రీతిలో విచిత్రమైన స్టంట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. భజ్జీ పంచుకున్న ఆ వీడియోలోని ఫీట్ చేయడం ఎవరికైనా కష్టతరమే. ఈ వీడియో చూసిన నెటిజన్లు భజ్జీని ఆటపట్టిస్తున్నారు. "మొదట నువ్వు డెమో చేసి చూపించు," అని అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ఎవరూ ప్రయత్నించవద్దని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.