ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఎలాగైనా దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. అయితే, సీఎస్కే ఆటగాళ్లకు కరోనా సోకడం, కొంతమంది లీగ్ నుంచి వైదొలగడం జట్టును కష్టాల్లోకి నెట్టినట్లైంది. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు రైనా. స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇప్పటికీ దుబాయ్‌కి చేరుకోలేదు. ఈ క్రమంలోనే భజ్జీ టోర్నమెంటు నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లని ఫ్రాంచైజీ అధికారిక వర్గాలు తెలిపాయి. కానీ హర్భజన్ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు.
ఐపీఎల్‌కు దూరంగా హర్భజన్ సింగ్? - latest harbajan singh ipl news updates
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, వాటిలో వాస్తవం లేదని ఫ్రాంచైజీ అధికారిక వర్గాలు తెలిపాయి.
![ఐపీఎల్‌కు దూరంగా హర్భజన్ సింగ్? Harbhajan Singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8641380-649-8641380-1598964692294.jpg)
హర్బజన్ సింగ్
ఈ విషయంపై హర్భజన్‌ను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. మరోవైపు 2020 ఐపీఎల్లో రైనాను కోల్పోతున్నట్లు ఆగస్టు 29న సీఎస్కే ట్వీట్ చేయడం.. ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ నగరాలు ఇందుకు వేదిక కానున్నాయి.
Last Updated : Sep 1, 2020, 8:31 PM IST